మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి రూ. 10 కోట్లు
MDCL: మల్లాపూర్ వార్డు కార్యాలయంలో DE రూపా, AE శ్రవంతితో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డివిజన్ అభివృద్ధికి మంజూరైన రూ. 10 కోట్ల నిధుల పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, బాక్స్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేయడం, పార్కుల అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.