బాలికల హక్కులపై అవగాహన కార్యక్రమం
KDP: వల్లూరు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి భారతి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బాలికల సమానత్వం, విద్యా హక్కులు, లింగ వివక్ష నిర్మూలన వంటి కీలక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ. వెంగల్ రెడ్డి, జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.