మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి చుక్కెదురు
RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయమూర్తి, తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు. దీంతో రోహిత్ రెడ్డి మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సి వస్తోంది.