పద్మనాభస్వామి ఆలయంలో గుంటూరు ఎంపీ పూజలు

GNTR: గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేతులు జోడించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించారు. వ్యక్తిగత ప్రార్థనలతో పాటు దేశ భద్రత కోసం, దేశాన్ని నిజమైన భక్తితో కాపాడుతున్న మన సాయుధ బలగాల ధైర్యసాహసాల కోసం కూడా ప్రార్థించినట్లు తెలిపారు.