భువనగిరిలో ఘనంగా ‘నేషనల్ ఈఎంటీ డే’

భువనగిరిలో ఘనంగా ‘నేషనల్ ఈఎంటీ డే’

BHNG: భువనగిరిలోని 108 కార్యాలయంలో జాతీయ ఈఎంటీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈఎంటీలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడటం తమకు దక్కిన గొప్ప గౌరవమని వారు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఈఎంటీలు విశ్వం, రవికుమార్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.