ప్రజల భద్రత కోసం ఎస్పీ ప్రత్యేక సూచనలు

ప్రజల భద్రత కోసం ఎస్పీ ప్రత్యేక సూచనలు

NLG: చలికాలంలో తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. మంచులో అజాగ్రత్తగా నడిపేవారికే కాకుండా, ముందున్న వాహనదారులకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు. పాదచారులు, జంతువులు, సిగ్నల్స్ సరిగ్గా కనిపించవని, కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచనలు చేశారు.