ఆ ఇంట ముగ్గురు సర్పంచులు
WGL: నర్సంపేట (M) రాజుపేట గ్రామపంచాయతీ 1970లో ఏర్పడింది. ఈ గ్రామనికి ఇప్పటి వరకు 8సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒకే ఇంటి నుంచి ముగ్గురు సర్పంచులుగా పనిచేశారు. తల్లి, కొడుకు, కోడలు గ్రామ ప్రథమ పౌరులుగా పనిచేశారు. 2001లో బానోతు కోమటి(కోడలు) సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆమె అత్త మల్లమ్మ 2006 నుంచి 2011 వరకు సర్పంచిగా ఉన్నారు. 2019లో దస్రు(కొడుకు) గెలిచి 2024 వరకు పనిచేశారు.