ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
KNR: ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లిలో బుధవారం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని వెంకటేష్ (27) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి తలుపులు మూసి ఉండటంతో, స్థానికుల సాయంతో తెరిచి చూడగా వెంకటేష్ విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.