రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్న భవానిలు
NTR: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. భవాని భక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా దాడి చేశారని భవానీ భక్తులు బెంజ్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. కంకిపాడు నుంచి ఆటోలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులపై రామ లింగేశ్వర కట్ట వద్ద అడ్డుకుని దాడి చేశారని భవానిలు ఆరోపిస్తున్నారు.