ఫీజు బకాయిలపై మిర్యాలగూడలో బంద్..
NLG: ఫీజు రీయింబర్‌మెంట్స, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్ ప్రారంభించాయి. బకాయిలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేసేవరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.