పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురిపై కేసు నమోదు

పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురిపై కేసు నమోదు

KNR: కరీంనగర్ ఆరేపల్లిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. రోడ్డు పక్కన కూర్చొని మద్యం సేవిస్తూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బ్లూ కోర్ట్ పోలీసులు వెళ్లగా రాకేష్, అచ్యుత్, ప్రవీణ్ అనే వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారన్నారు.