VIDEO: కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
ADB : బోథ్ పట్టణంలోని ఎలుకూరి పోతన్నకు చెందిన గొర్రెల కొట్టంపై అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గొర్ల కొట్టంలో ఉన్న 20 గొర్రెలు మృతి చెందగా, పది మేకలు తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. వీధి కుక్కలను అరికట్టాలని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.