తెలంగాణ జాగృతి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా జైల్‌సింగ్
KMR: లింగంపేట్ మండలం రామాయిపల్లికి చెందిన డేగావత్ జైల్‌సింగ్ తెలంగాణ జాగృతి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా తనను నియమించడంపై కవితకు కృతజ్ఞతలు తెలిపారు.