అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసన

KMM: ఖమ్మం నగరం 53వ డివిజన్‌లోని అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య నాగరాజు చిన్నారులకు అన్నం తినిపించి ఆశీర్వదించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఎదగాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.