ఉపాధ్యాయులకు ఆటల పోటీలు ప్రారంభం

ఉపాధ్యాయులకు ఆటల పోటీలు ప్రారంభం

CTR: విజయపురం మండల కేంద్రం నందు ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని బుధవారం ఏం ఈవో హరిప్రసాద్ వర్మ ఆటల పోటీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులలోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి, పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి క్రీడలు దోహద పడతాయని పేర్కొన్నారు. ఈ మేరకు వాలీబాల్, సట్ ఫుట్, క్రికెట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ ఛైర్స్ పోటీలను నిర్వహించారు.