VIDEO: బడికి వెళ్లాలంటే నరకయాతన తప్పదా..!

VIDEO: బడికి వెళ్లాలంటే నరకయాతన తప్పదా..!

VZM: బొండపల్లి మండలం చిన్నంగూడెం, ఎర్రొడ్లపాలెం గిరిజన గ్రామాల్లో విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రహదారులు దారుణంగా మారడంతో నిత్యం మూడు కిలోమీటర్ల దూరం మోకాలి లోతు బురదలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు సదుపాయం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.