శ్రీ రామాలయ శతాధిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి

శ్రీ రామాలయ శతాధిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి

KRNL: కర్నూలు మెయిన్ బజార్‌లో ఉన్న శ్రీ రామాలయం 101 శతాధిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదివారం పాల్గొన్నారు. పూజలు చేసిన అనంతరం రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ప్రజలపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం పూర్తైన ఈ రోజుల్లో మనం జీవించి ఉండటం అదృష్టమన్నారు.