గోమరణాలపై అసత్య ప్రచారాలు తగవు: ఎమ్మెల్యే

SKLM: టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.