నేడు జిల్లాలో జాబ్ మేళా
SRD: బైపాస్ రోడ్డులోని వెలుగు కార్యాలయంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి నిర్మల తెలిపారు. హైదరాబాద్‌లోని 'జుంబోటైల్ టెక్నాలజీస్' సంస్థలో డెలివరీ బాయ్స్, ప్యాకర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.