నార్పలలో రేపు సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ

ATP: శింగనమల నియోజకవర్గాకి మంజూరైన సూక్ష్మ సేద్య పరికరాలను ఈ నెల 16న పంపిణీ చేస్తామని ఏపీఎంఐపీ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. నార్పలలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వాటిని లబ్ధిదారులకు అందజేస్తారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రైతులు, అనుబంధ శాఖల అధికారులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.