ఫేస్ వాష్‌తో రోడ్డు ప్రమాదాలకు చెక్

ఫేస్ వాష్‌తో రోడ్డు ప్రమాదాలకు చెక్

NLR: జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.