డీఈఓను పరామర్శించిన కలెక్టర్

ADB: ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి ప్రణీతకు గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి డీఈఓ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తదితరులున్నారు.