VIDEO: మొవ్వలో చెత్త బండిని నడిపిన ఎమ్మెల్యే
కృష్ణా: మొవ్వ మండలంలోని మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని చెత్త బండిని నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన ఇంటి నుంచే పరిశుభ్రతను ప్రారంభించాలని సూచించారు. స్వచ్ఛతే ఆరోగ్యానికి పునాదని తెలిపారు . గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంటేనే అభివృద్ధి ఫలిస్తుందని తెలిపారు.