మత్తడి దూకిన బండపల్లి ఊర చెరువు

మత్తడి దూకిన బండపల్లి ఊర చెరువు

SRCL: చందుర్తి మండలంలోని బండపల్లి ఊర చెరువు మత్తడి దూకడంతో గ్రామంలోని కల్వర్టుపై నుంచి నీరు అధికంగా ప్రవహించింది. దీంతో కొనరావుపేట మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది రైతులు తమ ఎడ్లబండ్లపై రాకపోకలను సాగించారు. కల్వర్టుపై వంతెన నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.