'దుకాణాలను వెంటనే తొలగించాలి'
NLG: చండూరులోని గుండెపల్లి రోడ్డులోని హై స్కూల్ గోడను ఆనుకుని ఏర్పాటు చేసిన దుకాణాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ మల్లేష్ ఆదేశించారు. ఈరోజు దుకాణదారులకు వినతి పత్రాలు అందించి, 7 రోజులలోపు ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే, మున్సిపల్ శాఖే వాటిని తొలగించి, మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 189 ఆ ఖర్చును దుకాణదారుల నుంచే వసూలు చేస్తామని హెచ్చరించారు.