నేడు డయల్ యువర్ సీఎండీ

నేడు డయల్ యువర్ సీఎండీ

ATP: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం చేపడతారన్నారు. విద్యుత్ వినియోగదారులు సమస్యలుంటే ఫోన్ ద్వారా తెలియజేయాలన్నారు.