రోడ్లపై చెత్త వేస్తే ఆన్‌లైన్ జరిమానా: కమిషనర్

రోడ్లపై చెత్త వేస్తే ఆన్‌లైన్ జరిమానా: కమిషనర్

తిరుపతి నగరంలో కాలువలు, రోడ్లపై చెత్త వేసే వారిని సీసీ కెమెరాలు ద్వారా గుర్తించి ఆన్‌లైన్ జరిమానాలు విధించనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఇవాళ తెలిపారు. స్మార్ట్ సిటీ ద్వారా నగరంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను ఆమె పరిశీలించారు. ఈ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు.