పులి సంచారం.. గ్రామాల్లో భయం

పులి సంచారం.. గ్రామాల్లో భయం

కాకినాడ జిల్లాలో తిరిగిన పులి ప్రస్తుతం పోలవరం జిల్లా దండంగి కొండల్లో మకాం వేసింది. పూడిపల్లి వద్ద రెండు లేగదూడలను హతమార్చినట్లు అటవీశాఖ తెలిపింది. పాపికొండలు, గోదావరి తీరం పులికి అనుకూలంగా మారిందని స్థానికులు అంటున్నారు. పులి సంచారంతో గిరిజనులు పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.