ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన.!
KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది.ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.