VIDEO: ఫ్లై ఓవర్ నిర్మించి.. సర్వీస్ రోడ్డు మరిచారు

TPT: రేణిగుంట-తిరుపతి ప్రధాన రహదారిపై ఫ్లె ఓవర్ నిర్మాణం పూర్తై దాదాపు పదేళ్లు గడిచింది. ఇంత వరకు సర్వీస్ రోడ్డు సమస్య మాత్రం పరిష్కారం కాలేదని స్థానికులు వాపోయారు. తిరుపతి వైపు వెళ్లే డౌన్ రోడ్డుకు ఒకే సర్వీస్ రోడ్డు ఉండటంతో రాంగ్ రూట్‌లో పాదచారులు, వాహనదారులు రోడ్డు దాటాల్సి వస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు నిర్మించాలన్నారు.