ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. యువతి ఆత్మహత్య
కృష్ణా: గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన రాగశ్రీకి, కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తనకు రూ.5 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు తాగింది. చికిత్స పొందుతూ రాగశ్రీ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.