ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ నియోజకవర్గం హాజిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. ఇంటిని మూడు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారురాలికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటిని నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, నాయకులు పాల్గొన్నారు.