కరెన్సీ నోట్లతో దర్శనమివ్వనున్న గణేశుడు

కరెన్సీ నోట్లతో దర్శనమివ్వనున్న గణేశుడు

GNTR: మంగళగిరిలోని మెయిన్‌ బజార్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని రూ. 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే నిర్వాహకులు ఈ అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆర్యవైశ్య సంఘం, సంక బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ 'ధననాథుడిని' సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకుడు సంక బాలాజీ గుప్తా తెలిపారు.