సబ్ స్టేషన్ ఉద్యోగిపై వేటు..
ADB: తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ స్టేషన్ ఆపరేటర్ తీరుతో మద్యం, పేకాట కేంద్రంగా మారింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులను ఆరా తీయగా.. ఈ ఘటనపై మండల ఏఈ విచారణ జరిపించి.. మందలించారు. ఈ మేరకు ఈ సబ్ స్టేషన్ ఆపరేటర్‌పై వేటు వేసినట్లు సమాచారం. విధుల్లో ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.