పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
SKLM: గార మండలం కొర్నిలో గురువారం పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించారు. ఈ టీకాలు వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధి నివారించవచ్చని, పశువుల పెంపకంలో ఆర్థిక నష్టం నివారించవచ్చని వెటర్నరీ డాక్టర్ భూదేవి అన్నారు. ఈ వైరస్ వచ్చే పశువులలో జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు.