'స్థానిక ఎన్నికల్లో యాదవుల సత్తా చూపాలి'

SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం యాదవ సంఘం మండలాధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ మాట్లాడుతూ.. యాదవులందరూ ఏకతాటిపైకి వచ్చి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో యాదవుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.