'తెలుగు శాఖలో సేవలు చిరస్మరణీయం'
VSP: ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖలో కట్టమంచి రామలింగారెడ్డి 145వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆచార్య జర్రా అప్పారావు, ఆచార్య నరసింహారావు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కట్టమంచి ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి, విమర్శకుడు, విద్యావేత్తగా ప్రత్యేక స్థానం సంపాదించారని వక్తలు పేర్కొన్నారు.