కేబుల్ పనిచేసేవారిమంటూ.. గత నెల 26 నుంచే మకాం
ఏలూరులో ఇటీవల పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులు.. జియో కేబుల్ పనులు చేసేందుకు వచ్చామని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. గత నెల 26న ఇంట్లో దిగారు. నెలాఖరు వరకు ఆ వారం రోజుల అద్దె చెల్లించగా.. ఈ నెల అద్దె చెల్లించాలి. అయితే వారు ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ఎవరైనా మధ్యవర్తిత్వం వహించారన్న కోణంలో ఇంటి యజమానిని విచారిస్తున్నట్లు సమాచారం.