పీహెచ్ఈని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
SKLM: సారవకోట మండలం బొంతు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలలో పారిశుధ్యం తప్పనిసరి అని వైద్యులకు సూచించారు. మాన్సూన్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, సీజనల్ వ్యాధులు నివారణకు ముందు జాగ్రత్త తీసుకోవాలన్నారు.