బీసీ వసతిగృహ భవనాల మంజూరుకు కృషి: ఎమ్మెల్యే

బీసీ వసతిగృహ భవనాల మంజూరుకు కృషి: ఎమ్మెల్యే

SRD: బీసీ వసతి గృహాలు అద్దె భవనంలో ఉన్నందున, కొత్త భవనాల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.