'పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి'
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాకుబ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.