డీఎంకే పార్టీపై విజయ్ విమర్శలు

డీఎంకే పార్టీపై విజయ్ విమర్శలు

తమిళనాడులోని డీఎంకే పార్టీ ప్రజలను విడదీసేలా రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్, నటుడు విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి మళ్లీ ప్రారంభించారు. డీఎంకేది దోపిడీ భావజాలమని విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు, ర్యాడికల్స్‌కు నిలయమన్నారు. ఈ సందర్భంగా సమానత్వం కోసం తన పాలసీలను ఆయన వివరించారు.