కోహ్లీ ముందున్న అదిరిపోయే రికార్డులు
SAతో ODI సిరీస్‌లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే ఓ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. అలాగే 344 రన్స్ చేస్తే అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా.. హాఫ్ సెంచరీ చేస్తే స్వదేశంలో 100 సార్లు 50+ స్కోర్ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు. ఆసీస్ సిరీస్‌లో మూడో వన్డేలో మాత్రమే రాణించిన కోహ్లీ(74*) ఈ సారి పరుగుల వరద పారించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.