28న రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు

ప్రకాశం: ఈనెల 28వ తేదీన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు గిద్దలూరు మండలం ముండ్లపాడులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి పండగ సందర్భంగా పోటీలు నిర్వహిస్తునట్టు పేర్కొన్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.20వేలు , ద్యితీయ బహుమతి రూ.15వేలు, , తృతీయ బహుమతి రూ.10వేలు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8919017488 నంబర్ను సంప్రదించాలని కోరారు.