మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

NRML: మద్యానికి బానిసై ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. పార్డి(బి) గ్రామానికి చెందిన తోట రమేష్(34) గత కొంత కాలంగా ఏ పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై కృష్ణ రెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.