'ఎన్యుమరేటర్‌లను పారదర్శకంగా నియమించాలి'
JGL: పెగడపల్లి మండలంలో చేపట్టనున్న జనగణన సూపర్వైజర్లు ఎన్యూమరేటర్ల ఎంపికలో అవకతవకలు లేకుండా పారదర్శకంగా నియమించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నాయకులు గురువారం తహసీల్దార్ ఆనంద్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండల విద్యాశాఖ నుంచి పంపిన జాబితా కాకుండా అందులో కొన్ని పేర్లు చేర్చినట్లు తమ దృష్టికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు.