నార్సింగిలో రోడ్డు ప్రమాదం

నార్సింగిలో రోడ్డు ప్రమాదం

HYD: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ట్రాక్ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ వాహనం అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ రెండు సార్లు సైకిల్ ట్రాక్ మీదకు వాహనాలు దూసుకెళ్లి ప్రమాదాలు జరిగాయి.