ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి

ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి

ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం మాల్యం గ్రామానికి చెందిన 62 ఏళ్ల వడ్డే నాగప్పను ఆటో ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏఎస్సై శంకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు మినరల్ వాటర్ సప్లై చేసే ఓ ఆటో నాగప్పను ఢీ కొట్టింది.మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు .