అధికారుల నిర్లక్ష్యం.. పనులు పూర్తైనా నీరు అందడం లేదు

అధికారుల నిర్లక్ష్యం.. పనులు పూర్తైనా నీరు అందడం లేదు

NRPT: జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పథకం అమలు తీరు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గత BRS హాయంలో కుళాయిలను ఏర్పాటు చేసినప్పటికీ నీరు సరఫరా కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి కావడంతో నీరు సరఫరా లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.