పంచాయతీ ఎన్నికలు.. ఏకగ్రీవంగా తొలి సర్పంచ్!

పంచాయతీ ఎన్నికలు.. ఏకగ్రీవంగా తొలి సర్పంచ్!

TG: సిరిసిల్ల జిల్లా రుప్లానాయక్ తండాలో 510 మంది జనాభా, 8 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామ తండాను అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అదే గ్రామానికి చెందిన జవహర్‌లాల్ నాయక్ ముందుకొచ్చాడు. దీంతో గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరూ పార్టీలతో సంబంధం లేకుండా జవహర్‌లాల్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బాణాసంచా కాల్చి గెలుపు సంబురాలు చేసుకున్నారు.